ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కి తరలించాల్సిన సిబ్బంది మామూలు ఇవ్వని కారణంగా వాటిని సేకరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. టెక్కలిలోని సంభాల వారి వీధిలో మంగళవారం మున్సిపల్ సిబ్బందికి మామూలు ఇవ్వని కారణంగా వాహనంపై వేస్తున్న వ్యర్ధాలను పూర్తిగా కిందికి తోసి వేశారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని సిబ్బంది స్థానికులపై ఈసడించుకున్నారు. స్వచ్ఛభారత్ తీరు ఇదేనా అని వాపోయారు.