టెక్కలి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు గురువారం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ఎంఈఓలు డీ. తులసీరావు, డీ. చిన్నారావులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుల పాత్ర వివరించారు.