శ్రీకాకుళం జిల్లా వలేసాగరం వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్ఛాపురం రూరల్ హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్వరరావు (53), సాగరనవగాం మహిళ సుభద్రనాయకో (56) మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న జగదీశ్వరరావు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. టెక్కలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.