టెక్కలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి పీ.శోభారాణి బదిలీ అయ్యారు. ఆమెను నరసన్నపేటకు బదిలీ చేస్తూ శిశుసంక్షేమశాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్కలిలో గత కొంతకాలంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్థానంలో డీ.ఉమామహేశ్వరి ఇన్చార్జ్ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తారు.