టెక్కలి: వివాహిత ఆత్మహత్య

68చూసినవారు
టెక్కలి: వివాహిత ఆత్మహత్య
టెక్కలి మేజరు పంచాయతీ పరిధిలోని మెట్టవీధికి చెందిన గౌడు గీత(34) అనే వివాహిత బుధవారం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈనెల 9వ తేదీన కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

సంబంధిత పోస్ట్