టెక్కలి: పొలిపల్లి ప్రమాదం పట్ల మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి

75చూసినవారు
టెక్కలి: పొలిపల్లి ప్రమాదం పట్ల మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ సంఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నగరానికి చెందిన భావాజీ నాయుడు, గాంధీ, వడ్డీ వారి కుటుంబాలకు తీరని నష్టం జరిగిందని, సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్