సంక్రాంతి పండగకి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని టెక్కలి పోలీసులు సూచించారు. దొంగతనాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ మేరకు శనివారం టెక్కలిలో ఆటో ద్వారా అనౌన్స్ మెంట్ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో బహిరంగంగా మద్యం సేవించడం, జూదా శిబిరాలు నిర్వహించడం నేరమన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.