టెక్కలి: లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు: ఆర్డీఓ

67చూసినవారు
టెక్కలి: లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు: ఆర్డీఓ
స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైద్యాధికారులు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మెళియాపుట్టి, హిరమండలాల్లో మహిళల రేషియో తగ్గడంపై పరిశీలన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. మేరీ కేథరిన్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్