టెక్కలి డివిజన్ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ బదిలీ అయ్యారు. తాజాగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలలో భాగంగా ఈయనను ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది నెలలుగా టెక్కలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల టెక్కలి జగతిమెట్ట జగనన్న కాలనీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయాలని ఆదేశించిన నిజాయితీ గల అధికారి అని స్థానికులు ఆదివారం కొనియాడారు.