టెక్కలి: 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు

62చూసినవారు
టెక్కలి: 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు
టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆవరణలో 108 సిబ్బందికి శుక్రవారం జిల్లా ఏఈఎంఎస్ఓఈ రంగాప్రసాద్ పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ కృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో 108 సిబ్బందికి నూతన పోకడలకు అనుగుణంగా తరగతులు నిర్వహించారు. గర్భిణీలకు ప్రసవ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, నవజాత శిశువులకు చేసే ప్రథమ చికిత్స, పిసిఆర్ డాక్యుమెంటేషన్, 108 అంబులెన్స్ లో ఉండే పరికరాలు, మందులు వాటి ఉపయోగాల గురించి శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్