శ్రీకాకుళం గ్రామీణ మండలం గణగలంపేటలో మత్స్యకారుడు పుక్కల్ల గణేష్ మృతిపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు టెక్కలి క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారుల ద్వారా మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.