టెక్కలి మండలం సన్యాసి నీలాపురం సమీప రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోదుగువలస గ్రామానికి చెందిన బసవల రాణీ అనే మహిళ కదులుతున్న బైక్పై నుంచి జారిపడిపోవడంతో గాయపడింది. బైక్ నడిపే వ్యక్తి పేషెంట్ ని వదిలి వెళ్ళిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అమెను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.