టెక్కలి: మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

56చూసినవారు
టెక్కలి: మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ
టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన జీ. స్వప్న అనే మహిళ మెడలోని బంగారం గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై బాధితురాలు గురువారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం అర్ధరాత్రి ఇంటి బయటకు వస్తుండుగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు తెలిపింది. సుమారు 4 తులాల బంగారం అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్