ప్రతి నెల ఒకటో తేదీన నిరుపేదలకు పండగ దినోత్సవం

84చూసినవారు
ప్రతి నెల ఒకటో తేదీన నిరుపేదలకు పండగ దినోత్సవం
ప్రతి నెల 1వ తేదీన నిరుపేదలకు ఒక పండగ దినోత్సవం గా మారిందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. మంగళవారం సంతబొమ్మాలి మండలం నరసాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల నిరుపేదల కుటుంబాలలో ఒకటవ తేదీన పండగ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకటవ తేదీని పింఛన్లను అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్