ఈనెల 8న శ్రీశైలం గేట్లు ఓపెన్!

46చూసినవారు
ఈనెల 8న శ్రీశైలం గేట్లు ఓపెన్!
ఏపీలోని శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో అధికారులు గేట్లు తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 878 అడుగులుగా ఉండగా, పూర్తి సామర్థ్యం 885 అడుగులు. ఈ నేపథ్యంలో జూలై 8, 9 తేదీల్లో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్