ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, పదో తరగతి ఉత్తీర్ణత, 1-9 తరగతుల్లో పిల్లలు సాధించిన మార్కుల ఆధారంగా అకాడమిక్ స్టార్ రేటింగ్ ఇస్తారు. మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ సదుపాయం, తాగునీరు, ఫర్నిచర్, గదులు, గ్రంథాలయం వంటి సౌకర్యాల ఆధారంగా కూడా రేటింగ్ కేటాయిస్తారు. తక్కువ స్టార్లు సాధించిన పాఠశాలలపై దృష్టి సారించి, వాటి అభివృద్ధికి కృషి చేస్తారు.