టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

79చూసినవారు
టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
AP: టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎంలు ఐదేళ్లు, టీచర్లు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాలి. కేటగిరి-1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు, కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు ఇస్తారు. ఈ నెల 31 నాటికి ఖాళీలు, రిటైర్డ్ అయ్యే స్థానాలు, బదిలీ సహా అన్ని వివరాలను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

సంబంధిత పోస్ట్