పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను 2 ఏళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డ సవతి తండ్రికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలిక తల్లి పట్టుకున్నప్పటికీ మౌనంగా ఉండిపోయింది. "దీనిపై ఫిర్యాదు చేస్తే నన్ను, నా కుమార్తెను చంపుతానని బెదిరించేవాడు,” అని ఆమె పోలీసులకు చెప్పింది. బాలిక మానసికంగా ఆందోళనతో ఉన్నట్లు పాఠశాల టీచర్ గుర్తించి, ప్రశ్నించగా విషయం బయటపడింది.