ఏటా మూడు పంటలు పండించేలా చర్యలు: చంద్రబాబు

51చూసినవారు
ఏటా మూడు పంటలు పండించేలా చర్యలు: చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఏటా మూడు పంటలు పండించేలా, 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలన్నారు. వచ్చే వేసవిలో నీటికొరత లేకుండా 141  మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్