భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200.15 పాయింట్లు నష్టపోయి 82,330.59 వద్ద, నిఫ్టీ 42.30 పాయింట్లు క్షీణించి 25,019.80 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్జ్యూమర్, ఎటర్నల్ లాభాలను ఆర్జించగా, భారతీ ఎయిర్‌టెల్, JSW స్టీల్, ఇన్ఫోసిస్, SBI, HCL టెక్నాలజీస్ నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది.