AP: రైతుల ముసుగులో మహిళలు, పోలీసులపై వైసీపీ నేతలు రాళ్లు విసిరారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు.’ అని తెలిపారు.