AP: రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఎండీయూ ఆపరేటర్లకు అండగా వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు.