ఏపీకి ముంచుకొస్తున్న తుఫాను.. అతి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మత్స్యకారులు శుక్రవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.