అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా వచ్చిన తాజా చిత్రం 'స్త్రీ 2'. 2018లో వచ్చిన 'స్త్రీ' మూవీకి స్వీకెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక తొలి రోజు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోగా, ఈ ఏడాది విడుదలైన హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అలాగే ఫస్ట్ డే రూ.47 కోట్ల కలెక్షన్లతో ఫైటర్, కల్కి(హిందీ) రికార్డులను బ్రేక్ చేసింది.