దుస్తులు విప్పి బెల్టుతో కొట్టారు (వీడియో)

574చూసినవారు
యూపీ మహోబాలో ఇటీవల దారుణం జరిగింది. ఖరేలా పోలీస్ స్టేషన్ పరిధి ఐచానా గ్రామంలో మద్యం షాపు దగ్గర ఓ వ్యక్తిని కొందరు దుండగులు చుట్టుముట్టారు. అనంతరం అతడి దుస్తులు విప్పి, అర్ధనగ్నంగా మార్చారు. ఆ తర్వాత బెల్టుతో నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టారు. దాడికి వెనుక కారణం స్పష్టంగా తెలియలేదు. తీవ్రగాయాలతో బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్