2000-2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. అయితే హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వివక్ష, వెనుక బడిన వాళ్లందరిని ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు వర్గీకరణను సుప్రీం సమర్థించింది.