ఆన్‌లైన్ గేమింగ్‌లో భారీగా నగదు పోగొట్టుకున్న ఓ విద్యార్థి తన బకాయిలను తిరిగి చెల్లించేందుకు బ్యాంకును దోచుకునేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం భోపాల్‌లో చోటుచేసుకుంది. పిప్లానీ ప్రాంతంలో ఉన్న ధనలక్ష్మి బ్యాంక్‌లోకి మాస్క్‌లు ధరించిన ఓ విద్యార్థి.. చిల్లీ స్ప్రే బాటిల్‌తో అక్కడి వారిపై దాడి చేశాడు. అయితే, అక్కడి వారు వెంటనే స్పందించడంతో అతడు బయపడి పారిపోయాడు. ఇది జరిగిన గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.