AP: స్కూళ్లు తెరుచుకున్న రోజు నుంచే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లను విద్యార్థులకు అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ (SSA) ఏర్పాట్లు చేస్తోంది. ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, 3 జతల దుస్తులు, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ అందించనున్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయ కమిటీ సమావేశం నాటికి విద్యార్థులందరికీ కిట్లు అందిస్తారు.