12 నుంచి విద్యార్థి మిత్ర కిట్‌లు పంపిణీ

82చూసినవారు
12 నుంచి విద్యార్థి మిత్ర కిట్‌లు పంపిణీ
AP: స్కూళ్లు పున:ప్రారంభమయ్యే ఈ నెల 12 నుంచే విద్యార్థులకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని HMలకు సూచించింది. దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు 95 శాతం వస్తువులను చేరవేశారు. 3 జతల యూనిఫామ్, బెల్ట్, నోట్‌బుక్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి. ఒక్కో కిట్‌కు ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.

సంబంధిత పోస్ట్