ఏపీలో శనివారం యథావిధిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 12ను వర్కింగ్ డేగా ప్రకటిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసింది. శనివారం ఉదయం 11 నుంచి 5.30 గంటల వరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు మెమోలో పేర్కొంది. ప్రభుత్వం రేపు (రెండో శనివారం) సెలవును రద్దు చేయడంతో రూ.5వేలు చెల్లించకుండానే సాధారణంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.