ఈ ఏడాది నుంచే ‘సూపర్ సిక్స్’ అమలు: చంద్రబాబు

75చూసినవారు
ఈ ఏడాది నుంచే ‘సూపర్ సిక్స్’ అమలు: చంద్రబాబు
AP: ఈ నెల 28న ఉభయ సభల్లో వార్షిక బడ్జెట్ (2025-26) ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించగా.. బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్