ఏపీలో రైతులకు ప్రభుత్వం రాయితీపై విత్తనాల సరఫరా చేయనుంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై విత్తన సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్, జులైలో సాధారణానికి మించి 48.6 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలకు 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33 వేల హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైంది. ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లిలో భారీగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.