అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

75చూసినవారు
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులను పంపివేయకుండా ఎందుకు నిర్బంధ కేంద్రాల్లో ఉంచారని ప్రశ్నించింది. వారిని రెండు వారాల్లోగా రాష్ట్రం నుంచి పంపేయాలని అస్సాం ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు జస్టిస్ అభయ్, ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని రెండు వారాల్లోగా పంపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్