AP: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగంపై పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.