తమిళ హీరో సూర్య, గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ సూర్య S/O కృష్ణన్. ఈ మూవీ 2008లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా సూర్య S/O కృష్ణన్ మూవీని రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ మూవీలోని పాటలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీలోని పాటలు ట్రెండ్ చేస్తున్నాయి.