యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య - చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్ పేరుతో గ్లింప్స్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్‌గా మారడాన్ని ఇందులో చూపించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.