ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా రాణించినా.. బ్యాటర్‌గా తీవ్ర నిరాశపర్చాడు. అన్ని మ్యాచ్‌ల్లో దాదాపు ఒకేరకంగా ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ ఆటతీరు గురించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ శైలిని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అశ్విన్ అన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 0,12,14,0,2 ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరాడు.