AP: దివ్యాంగులకు ప్రభుత్వం షాకిచ్చింది. సామాజిక పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నిరాశే ఎదురుకానుంది. అయితే పింఛన్‌దారులలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దాంతో జనవరి నుంచి మే వరకు పింఛన్ల తనిఖీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.