కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో యువకుడు మృతి కలకలం రేపింది. పట్టణంలోని మేకల బజారులో ఉపేంద్ర (23) అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలుండడంతో ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.