మారుతీ సుజుకీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జపాన్‌లో తీసుకొచ్చిన జిమ్నీ 5డోర్ వేరియంట్ బుకింగ్‌లను మారుతీ సుజుకీ తాత్కాలికంగా నిలిపివేసింది. జపాన్‌లో మారుతీ జిమ్నీ బుకింగ్‌లను జనవరి 30 నుంచి ప్రారంభించింది. బుకింగ్‌లు ప్రారంభించిన 4 రోజుల్లోనే 50వేల బుకింగ్‌లు సొంతం చేసుకుంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, వెయిటింగ్ పీరియడ్ పెరగడంతో బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.