ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన ఈ వైరస్ 70 దేశాలకు పైగా పాకింది. ఇక నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవటం, ఒళ్లు నొప్పులు, వెన్నునొప్పి, అలసట వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2-4 వారాలపాటు కొనసాగవచ్చు.