AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్‌కు శనివారం లేఖ రాశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలని, అందుకు తాను తాడిపత్రి వెళ్లాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. దాంతో ఎస్పీ జగదీష్ ఈసారైనా అనుమతి ఇస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.