సిక్కిం వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం

78చూసినవారు
సిక్కిం వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం
AP: సిక్కిం వరదల్లో విజయనగరం తహసీల్దార్ కుటుంబం చిక్కుకుంది. తహసీల్దార్ కూర్మనాథరావు (42)తో పాటు ఆయన భార్య ఉమ (38), కుమార్తె దీక్షిత (15), కుమారుడు జయాన్ష్ నారాయణ (6) ఐదు రోజుల క్రితం గ్యాంగ్‌టక్ విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం నార్త్ సిక్కిం ప్రాంతం మంగన్ జిల్లాలోని లుచూంగ్‌లో ఉన్నారు. అక్కడ కురిసిన భారీ వర్షాలకు వారు వెళ్లిన మార్గం కొట్టుకుపోయింది. దాంతో వారు హోటల్‌కే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్