జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో రానున్న పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'వార్-2'. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ మూవీ నుంచి తారక్ పేరు లీక్ అయ్యింది. ఈ చిత్రంలో NTR వీరేంద్ర రఘునాథ్ అనే పేరుతో పిలువబడతాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్‌స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 14న విడుదల కానున్నట్లు తెలిసింది.