AP: మరో 2 నెలల్లో రాష్ట్రానికి టీసీఎస్ రానుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో టీసీఎస్ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేశ్ ఢిల్లీ పర్యటనలో తెలిపారు. టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూముల పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. త్వరలోనే ఏపీలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో ప్రాజెక్టును వెనక్కి తీసుకొస్తున్నామన్నారు.