ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన నేతలు

85చూసినవారు
ఏపీలో పండుగ పూట రాజకీయ చిచ్చు రాజుకుంది. ఏలూరు జిల్లా చింతపాడులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా పెన్షన్ పంపిణీ చేయడంపై జనసేన కార్యకర్తలు, టీడీపీ నేతలు, అధికారులను నిలదీశారు. దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణ నెలకొంది. జనసేన గ్రామ అధ్యక్షుడు మోరు రామకృష్ణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్