గత ప్రభుత్వం అమలు చేసిన "అమ్మ ఒడి" పథకానికి కొనసాగింపుగా "తల్లికి వందనం" పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలకు రాజకీయంగా కౌంటర్ ఇచ్చింది. ఎలాంటి కోతలు లేకుండా ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రజల పక్షాన ప్రభుత్వం నడవడం నిజంగా శుభపరిణామం అని ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.