AP: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. నియోజకవర్గంలోని కీలక నేత అయిన పరిటాల శ్రీరామ్‌పై ఈ సర్వే చేపట్టింది. శ్రీరామ్ పనితీరు బాగుంటే 1 నొక్కాలని, ఫర్వాలేదనుకుంటే రెండు, బాగులేదంటే 3 నొక్కాలని టీడీపీ హైకమాండ్ నుంచి ధర్మవరంలోని ప్రజలకు కాల్స్ వచ్చినట్లు సమాచారం. అయితే శ్రీరామ్‌కి కొత్త పదవి ఇచ్చేందుకా? లేకుంటే కూటమి పార్టీలో ఏమైనా చీలకలు ఉన్నాయా? అనే విషయం తెలుసుకోవడానికి టీడీపీ ఈ సర్వే చేసినట్లు సమాచారం.