చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నేత హరినాథ్‌పై వైసీపీ నాయకుడు వేణుగోపాల్ కత్తితో దాడికి పాల్పడ్డారు. ఇద్దరి మధ్య ఓ దారి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో శనివారం కత్తి తీసుకొని దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హరినాథ్‌ను ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.