వరుసకు కూతురైన వివాహితపై ఓ టీడీపీ నేత ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖకు చెందిన టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.